Tuesday 8 May 2012

చిన్నారి కథ (ఈ చిత్రాల లోని చిత్రం ఏమిటో కనిపెట్టండి)


అనగనగా ఒక అందమైన ఊరు
 

 ఆ అందమైన ఊరికి చివర కొండ ప్రక్కన చిన్నారి వాళ్ల ఇల్లు
 

చిన్నారి వాళ్ల నాన్నగారు కొండ ప్రక్కన వున్న పొలం లొ వ్యవసాయం చేస్తుంటారు
 

పొలం లో పండిన కూరగాయల్ని వూరి లో ఉన్న బజారు లో అమ్ముతూ ఉంటారు.

చిన్నారి వాళ్ల ఇంటి ప్రక్కన ఒక అందమైన కొలను ఉంది













చిన్నారి కి ఎప్పుడూ కొలను లోని చేపలని ఇంకా రకరకాల జీవాలని చూడటం  ఎంతో ఇష్టం.












వాటిని చూస్తూ చిన్నారి చిన్న కొలను లోనె ఇన్ని వింతలు ఉంటె ఇక సముద్రము లో ఇంకెన్ని విశేషాలు ఉంటాయో కదా, ఎప్పటికైన సముద్రం లో వింతలు విశేషాలు అన్వేషించాలి అనుకుంటూ ఉండేది.
ఐతే రోజు రానే వచ్చింది















ఎంతో సంబరంగా చిన్నారి పడవ ఎక్కి సముద్రం లోకి బయలుదేరింది.
కాని దురదృష్తవశాత్తూ చిన్నారి పడవ తుఫాను లో చిక్కుకుంది.














ప్రచండ గాలి వేగానికి పడవ తునాతునకలైంది. చేతికి అందిన చెక్క సాయంతో తుఫాను తీవ్రత తగ్గిన తరువాత చిన్నారి ఎలాగో ఒడ్డుకు చేరింది.













తీరంలో ఎక్కడా మనుషుల జాడ కనిపించలేదు.
చిన్నారి నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్లింది ఐనా ఎవరూ కనిపించలేదు.














మరికొంత దూరం వెళ్లిన తరువాత చిన్నారికి పొలాలు దూరంగా కొండ పైన ఒకేఒక ఇల్లు కనిపించాయి.















ఆకలి తో అలసిపోయిన చిన్నారి దగ్గరగా వెళ్లి చూసినా అక్కడ కూడా మనుషులు కనిపించలేదు.











చిన్నారి ధైర్యంగా ఇంట్లోకి వెళ్లింది
అక్కడ చూసేసరికి ఆశ్చర్యం















 ఎవరూ లేని ఇంట్లొ బల్ల పైన రకరకాల తినుబండరాలు ఉన్నాయి
ఆకలి తో ఉన్న చిన్నారి వాటిని తిందామని ఒక పండుని చేతిలోకి తీసుకుంది అంతే అంతా మాయం అయిపోయాయి.














భయపడిన చిన్నారి ఒక్కసారిగా కళ్లు తెరిచి చూసేసరికి అప్పటివరకు తను చూసింది కల  అని తెలుసుకుంది.
తెళ్లారి చిన్నారి కల వాళ్ల అమ్మకు చెప్పింది. సముద్రపు వింతలు చూడాలని చిన్నారి కోరిక అర్థం చేసుకున్న వాళ్ల అమ్మ నాన్నతో చెప్పి సాయంత్రం చిన్నారిని ప్రక్క ఊరి లోని అక్వెరియంకి తీసుకువెళ్లారు.  



















ఈ పోస్ట్ లో ఒక విశేషం ఉంది. అది ఏమిటంటే కథ కోసం చిత్రాలు కాదు. చిత్రాల కోసం కథ వ్రాశాను. 
ఈ చిత్రాలన్ని కార్ల్ వార్నర్ అనే బ్రిటిష్ ఫోటొగ్రాఫర్ తినే పదార్థలతో సృష్టించిన చిత్రాలు.
కార్ల్ వార్నర్ గారికి అభినందనలతో మీకోసం ఈ పోస్ట్.

9 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. శ్రీ గారూ బొమ్మలతో మీరు చెప్పిన కథ బావుందండీ..ఇంకా చిన్న చిన్న పదాలతో ప్రయత్నించండి. మనకు తెలుగులో ఇలా బొమ్మల కథలు చాలా తక్కువ. ఆసక్తి ఉన్న పిల్లలు చదువుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. థన్యవాదాలు జ్యోతిర్మయి గారు

      Delete
  3. చాలా చిత్రంగా ఉంది! ఇవన్నీ ఫోటోలు అంటే నమ్మలేకుండా ఉన్నా! ఇవన్నీ పెయింటింగ్స్ అనిపిస్తోంది! మీ కథ కూడా బాగుందండీ కానీ చిన్న పిల్లల కథ వారి భాషకు తగ్గట్టుగా ఉంటే మరింత అందంగా ఉండేది అనిపించింది. అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. థన్యవాదాలు రసజ్ఞ గారు. అవునండి, ఇంకా చిత్రం ఏమిటంటే అవి అన్ని తినే పదార్థాలతో తీసిన ఫోటోలు.

      Delete
  4. love this story and photoes a lot. Very nice.

    ReplyDelete